Canada Prime Minister: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ..! 1 d ago
కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా ప్రకటించారు. పార్టీకి, ప్రధాని పదవికి కొత్త వ్యక్తిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని..ఆ తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. జస్టిన్ ట్రూడో వ్యవహార శైలి పట్ల కొంతకాలంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన జస్టిన్ ట్రూడో తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి నెలకొంది. ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని లిబరల్ పార్టీకి చెందిన నేతలే కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు.